నాని 25 లో పోలీస్ ఆఫీసర్ గా యంగ్ హీరో ?

Published on Feb 20, 2019 9:19 am IST

వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు నాని. అందులో భాగంగా ఇటీవల జెర్సీ షూటింగ్ ను పూర్తి చేసిన చేసిన ఆయన ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన 24 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నడు నాని. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో నాని తో పాటు సుధీర్ బాబు మరో హీరో గా నటించనున్నాడు.

అయితే ఈ చిత్రంలో నాని నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించనుండగా సుధీర్ బాబు పాజిటివ్ షేడ్స్ వున్నా పోలీస్ పాత్రలో నటించనున్నాడని టాక్. ఇక ‘నన్ను దోచుకుందువటే’ తరువాత ఇంతవరకు మరో చిత్రాన్ని మొదలు పెట్టలేదు సుధీర్ బాబు. ఈ సినిమా తరువాత బ్యాడ్మెంటన్ స్టార్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో నటించాల్సి వుంది. కానీ ఇంతవరకు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని విషయం ఫై క్లారిటీ లేదు.

సంబంధిత సమాచారం :