పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ‘సుడిగాలి సుధీర్‌’ !

Published on May 22, 2021 10:53 pm IST

సుడిగాలి సుధీర్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత కొన్ని నెలలుగా వస్తోన్న పుకార్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రూమర్ల పై గతంలోనే సుధీర్ క్లారిటీ ఇచ్చినా, ఈ రూమర్లకు మాత్రం బ్రేక్ పడటం లేదు. తాజాగా సుధీర్ పెళ్లి టాపిక్‌ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అయింది. ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి పై క్లారిటీ ఇచ్ఛాడు సుధీర్. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని, మరో రెండేళ్ల వరకు బ్యాచిలర్‌ గానే ఉండాలని నిర్ణయించుకున్నాని చెప్పుకొచ్చాడు.

ఇక బుల్లితెర పై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సుధీర్‌, ఈ మధ్య హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఎలాగూ బుల్లి తెర పై సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు కాబట్టి, వెండితెరను టార్గెట్ చేశాడు. అయితే, బాక్సాఫీస్ వద్ద సుధీర్ హీరోగా ఎంతవరకు నిలబడతాడో చూడాలి. ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ అంటూ రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలలో ఒక సినిమాకి బాక్సాఫీస్ వద్ద విజయం దక్కింది. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి పులిచర్ల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ‘గాలోడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :