“సాఫ్ట్వేర్ సుధీర్” గా రానున్న సుడిగాలి సుధీర్

Published on May 25, 2019 10:28 am IST

తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ కలిగిన కామెడీ షో “జబర్దస్త్”. ఈ షో తో పాపులరైన షకలక శంకర్, హీరోగా సినిమాలు చేస్తుండగా..మిగతా చాలామంది కామెడిన్స్ పలు తెలుగు సినిమాలలో అవకాశాలుపొందుతూ దూసుకుపోతున్నారు. జబర్దస్త్ షో తో బాగా పాపులర్ ఐన వాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకరు.
జ‌బ‌ర్ధ‌స్త్‌తో ఆరంగేట్రం చేసి మంచి పాపులారిటీ తెచ్చుకొన్న సుడిగాలి సుధీర్ ఢీ, పోవే పోరా వంటి కార్య‌క్ర‌మాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి బాగాదగ్గరయ్యాడు.

వెండితెర‌పై ప‌లు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ పోషించిన సుధీర్ ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులి చ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ “సాఫ్ట్‌వేర్ సుధీర్” అనే చిత్రంలో హీరోగా క‌నిపించ‌నున్నాడు. ధన్యా బాలకృష్ణ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు సగభాగం చిత్రీకరణ పూర్తైన ఈ మూవీని జులై చివరివారంలో విడుదల చేయాలని చూస్తున్నారట. కథే ప్రధానంగా తెరకెక్కనున్న ఈ మూవీ విజయం పై పూర్తి విశ్వాసంతో ఉన్నాడంట సుధీర్.

సంబంధిత సమాచారం :

More