“సాహో”తో సుజీత్ ఏం చెప్పాలనుకుంటున్నాడు.?

Published on May 27, 2019 12:00 am IST

భారతదేశం లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా “సాహో” కూడా ముందు ఉంటుంది.డార్లింగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫుల్ ఆన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది అని అందరికీ అర్ధం అయ్యిపోయింది.అవ్వడానికి రెండో సినిమాయే అయినా దర్శకుడు సుజీత్ భారీ బడ్జెట్ తో అత్యున్నత ప్రమాణాలతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు.దీనితో ఈ చిత్రం పై కూడా అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి మంచి స్పందన వస్తుండడంతో పాటు భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.కానీ ఈ చిత్ర దర్శకుడు ఈ చిత్రంతో అసలు ఏం చెప్పదలచుకున్నారో ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతుంది.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ప్రభాస్ లోక్ ను గనుక పరిశీలిస్తే ఒక లుక్ కి మరో లుక్ కి అస్సలు పొంతన కనబడడం లేదు.దీనితో ప్రభాస్ మేకోవర్ అంతేనా లేక ఈ చిత్రం నుంచి మనం డ్యూయల్ రోల్ ను కూడా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా అన్న అనుమానం కలుగుతుంది.సుజీత్ ప్రభాస్ ను అలా చేంజ్ చేసేసారు మరి.అసలు ఇన్ని వేరియేషన్స్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ తెలియాలంటే ఒక టీజరో లేక ట్రైలరో విడుదల చేసినా బాగుండేది.దీనితో ఈ సస్పెన్స్ మరింత ఎక్కువతుంది.మరి సుజీత్ ఏం చెప్పదలుచుకున్నారో తెలియాలంటే వచ్చే ఆగష్టు 15 వరకు ఆగక తప్పదు.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More