మరో మెగా మేనల్లుడి సినీరంగ ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వడానికి రెడీ అయిపోయాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా ఇంతకు ముందు సుకుమార్ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రానికి రైటర్‌గా కూడా పనిచేశారు. ఈ నూతన చిత్రానికి పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.


