బన్నీ తరువాత చిరంజీవిని డైరెక్ట్ చేయనున్న సుకుమార్?

Published on Feb 12, 2020 11:30 am IST

మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి ఎప్పటినుండో భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర తెలుగు రీమేక్ రైట్స్ రామ్ చరణ్ దక్కించుకున్నారు. కాగా ఈ మూవీ తెలుగు స్క్రిప్ట్ దర్శకుడు సుకుమార్ సిద్ధం చేసి ఉంచారట. బన్నీతో మూవీ తరువాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదని సమాచారం. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ తెరెకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో కొద్దిరోజులుగా నిరవధిక షూటింగ్ జరుగుతుంది.

ఇక సుకుమార్ బన్నీ 20వ చిత్ర సెకండ్ షెడ్యూల్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కేరళలో చిత్రీకరించడం జరిగింది. ఈ షెడ్యూల్ నందు బన్నీ పాల్గొనలేదు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలోతెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. సంగీతం దేవిశ్రీ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :