ప్రేమ కథని కోరుకుంటున్న రామ్ చరణ్ !

14th, September 2016 - 01:12:52 PM

charan1

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ‘ధృవ’ తరువాత దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే చరణ్, సుకుమార్ తో ఈ ప్రాజెక్ట్ కోసం ఓ మంచి ఫీల్ ఉన్న ఫ్రెష్ లవ్ స్టోరీని ప్రిపేర్ చేయమని చెప్పాడట. ఎందుకంటే మొదటి నుండీ మాస్, యాక్షన్ ఇమేజ్ లోనే ఉండిపోయిన తను ఇకపై కొత్త ఇమేజ్ ను ట్రై అనుకుంటున్నాడట. అందుకే సుకుమార్ కు లవ్ స్టోరీ సిద్ధం చేయమని చెప్పాడని తెలుస్తోంది.

‘ఆర్య’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి, ‘100% లవ్’ తో ప్రేమ కథలను చెప్పడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన సరళిని ఏర్పరచుకున్న సుకుమార్ కూడా చెర్రీ కోరిక మేరకు కోనసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే బ్రహ్మాండమైన లవ్ స్టోరీని ప్రిపేర్ చేశాడట. ఇది మాస్, క్లాస్ వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దేవి శ్రీ సంగీతం అందించనున్న ఈ చిత్రం నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇకపోతే చరణ్ నటిస్తున్న ‘ధృవ’ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకి రానుంది.