బన్నీ సినిమా నుండి తప్పుకున్నాడా ?

Published on Jul 5, 2020 1:06 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తోన్న సినిమా ‘పుష్ప’. కాగా ‘పుష్ప’లో తమిళ స్టార్ విజయ్‌ సేతుపతి ఓ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. అయితే విజయ్ సేతుపతి పుష్ప కోసం ఏప్రిల్ లో ఇరవై రోజులు, జూన్ లో పదిహేను రోజులు డేట్స్ ఇచ్చాడు. కానీ కరోనా వైరస్ కారణంగా షూట్ క్యాన్సల్ అవ్వడం, విజయ్ సేతుపతి డేట్స్ క్లాష్ అవ్వడం జరిగిపోయింది.

ఇప్పుడు డేట్స్ కుదరక ఈ సినిమా నుండి విజయ్ తప్పుకున్నాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌ కోసం అయితే బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అలాగే విలన్ గా కూడా ఏ సంజయ్ దత్ నో, సునీల్‌ శెట్టినో ఒప్పించాలని సుకుమార్ అనుకుంటున్నాడట. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా క్యూట్ బేబీ రష్మిక మందన్న నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. బన్నీ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోవాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More