సుకుమార్ చేతుల మీదుగా ‘కంట్రోల్-సి’ మోషన్ పోస్టర్ రిలీజ్

సుకుమార్ చేతుల మీదుగా ‘కంట్రోల్-సి’ మోషన్ పోస్టర్ రిలీజ్

Published on Jul 2, 2015 4:02 PM IST

sukumar
సెకండ్ ఇండిపెండెన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్న తనయుడు అశోక్ హీరోగా, దిశా పాండే హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం ‘కంట్రోల్-సి’. సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సాయిరామ్ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు అక్కడ జరిగిన విపత్తులో హీరో, హీరోయిన్ బ్రతుకుతారు. వారికి ఒక సీడీ దొరుకుతుంది. ఆ సీడీ కారణంగా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరగాయనేదే కథ. ఇలాంటి జోనర్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. సినిమా విజువల్స్ చూశాను. నైట్ ఎఫెక్ట్ విజువల్స్ మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఏ హాలీవుడ్ చిత్రానికీ తీసిపోవు. దర్శకుడు సాయిరామ్ సినిమా సూపర్ గా తెరకెక్కించాడు. తను, నిర్మాత ప్రభాకర్ మంచి స్నేహితులు. ప్రభాకర్ తన స్నేహితుడైన సాయిరామ్ ను డైరెక్టర్ గా చూడాలని కలగన్నాడు. ఇప్పుడు ప్రభాకర్ కల నిజమై, సాయిరామ్ దర్శకుడయ్యాడని అన్నారు.

“నాకు సుకుమార్ గారు పదేళ్ల నుండి పరిచయం ఈ మధ్యనే ఆయనతో దర్శకుడు కావాలనుకుంటున్నానని నా మనసులోని కోరిక బయటపెట్టాను. ఆయన మమ్మల్ని ఎంతో ప్రోత్సహించటమే కాకుండా సినిమా పరంగా చాలా మంచి సలహాలనిచ్చారు. పెద్ద బడ్జెట్ మూవీతో కాకుండా ముందు చిన్న సినిమా చేస్తే సినిమా రంగం గురించి అవగాహన వస్తుందని అన్నారు. అంతే కాకుండా అశోక్ ను మాకు అప్పగించారు. ఒక సాఫ్ట్ వేర్ క్యాంపస్ లో జరిగే థ్రిల్లర్ మూవీ. డిఫరెంట్ ఫీల్ ఇచ్చే మూవీ అని దర్శకుడు సాయిరామ్ చల్లా అన్నారు. “ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలనుకుంటే దర్శకుడు సాయిరామ్, మా బాబాయ్ సుకుమార్ నన్ను హీరోని చేసేశార”ని హీరో అశోక్ అన్నారు. ఎంటర్ టైన్మెంట్ తో పాటు మెసేజ్ ఉండేలా సినిమాలు చేయాలనుకుంటున్నాం. దేశభక్తిని ప్రేరేపించేలా మా బ్యానర్ కి సెకండ్ ఇండిపెండెన్స్ బ్యానర్ అని పేరు పెట్టాం. సుకుమార్ గారి సపోర్ట్ తోనే సినిమా రంగంలోకి వచ్చామని నిర్మాత తాటిపర్తి ప్రభాకర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ సనగాల, సినిమాటోగ్రాఫర్ చంద్రమౌళి, బెనర్జీ, పృథ్వి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: అచ్చు, సాహిత్యం: శ్రీమణి, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీధర్ సనగాల, కో ప్రొడ్యూసర్: విజయ్ మోహన్ రెడ్డి, ప్రొడ్యూసర్: తాటిపర్తి ప్రభాకర్, దర్శకత్వం: సాయిరామ్ చల్లా.

తాజా వార్తలు