ఆ యంగ్ హీరో సినిమా కోసం సుకుమార్..?

ఆ యంగ్ హీరో సినిమా కోసం సుకుమార్..?

Published on Jun 27, 2026 1:58 AM IST

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఒకవైపు రామ్ చరణ్‌తో తన నెక్స్ట్ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తూనే, మరోవైపు నిర్మాతగా తన ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ పరిధిని మరింత విస్తరిస్తున్నాడు. ప్రియదర్శి హీరోగా ఓ కొత్త సినిమాను లాంచ్ చేసిన ఆయన, ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సుకుమార్ సమర్పించనున్నాడు.

ఈ చిత్రం ద్వారా సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పనిచేస్తున్న బాబీ దర్శకుడిగా పరిచయం కానున్నాడట. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధూ, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఇండస్ట్రీ వర్గాల్లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

ఇప్పటికే ‘కుమారి 21F’, ‘ఉప్పెన’, ‘విరూపాక్ష’ వంటి వైవిధ్యమైన బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్.. టాలీవుడ్‌లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన కథాబలం ఉన్న చిత్రాలను నిర్మిస్తూ, కొత్త దర్శకులకు ఇదొక కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

తాజా వార్తలు