అదిరిపోయే స్టోరీ లైన్ తో బన్నీ,సుకుమార్ మూవీ.

Published on Aug 1, 2019 4:15 pm IST

దర్శకుడు సుకుమార్, బన్నీ మరో సెన్సేషనల్ చిత్రం కొరకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రానున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించడం జరిగింది. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొటుండగా, సుకుమార్ గత సంవత్సర కాలంగా ఈ మూవీ స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు.. ఐతే ఈ మూవీ స్టోరీ లైన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందట. సౌత్ ఇండియాలో విస్తరించి ఉన్న అడవులలో స్మగ్లర్స్ సాగించే ఎర్ర చందనం గ్యాంగ్ ల అకృత్యాలు,నేర చరిత ఆధారంగా ఈ కథ ఉంటుందట.ఈ చిత్రంలో మరి బన్నీ రోల్ ఏమిటనేది తెలియాల్సివుంది. స్టోరీ లైన్ తోనే ఈ మూవీ కావలసినంత ప్రచారం తెచ్చుకొని హాట్ టాపిక్ గా మారింది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందాన నటిస్తుండగా,దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రంకి పనిచేసే మిగతా నటుల,సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. గతంలో సుకుమార్,బన్నీ ఆర్య, ఆర్య2 చిత్రాలకు కలిసిపనిచేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More