ఎన్టీఆర్ బయోపిక్ లో ‘ఏఎన్ఆర్’ గా ఎవరంటే !

Published on Aug 4, 2018 3:52 pm IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. ఇక ఈచిత్రంలో అక్కినేని నాగేశ్వర్ రావు గారి పాత్రలో ఆయన మనవడు నాగ చైతన్య నటించనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు ఈపాత్ర కోసం అక్కినేని ఫ్యామిలీ లో నుండే మరొకరిని ఎంపిక చేశారు. ఆయనే ఎవరో కాదు హీరో సుమంత్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు. ఈ సంధర్బంగా మా తాత గారి పాత్రలో నటించడం నా అదృష్టం. ఇంత గొప్ప సినిమాలో నేను భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉంది అని ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు సుమంత్.

సంబంధిత సమాచారం :

X
More