తన సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న హీరో !

తన సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న హీరో !

Published on Nov 28, 2018 4:00 AM IST

Sumanth1

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కథానాయకుడిగా రాబోతున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్రంలో సుమంత్ సరసన ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా రిజల్ట్ పై సుమంత్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. మంచి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుందట.

కాగా ఈ సినిమాలో సుమంత్ ఓ నాస్తికుడుగా, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో కనిపించనున్నాడు. దేవుడికి వర్సెస్ నాస్తికుడు అయినా హీరోకి మధ్య, ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.

భీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు