కష్టమైనా క్లైమాక్స్ అక్కడే చేసి తీరాలంటున్న సందీప్ కిషన్

Published on Sep 18, 2020 11:12 pm IST

యంగ్ హీరో సందీప్ కిషన్ చేస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. హాకీ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డెన్నిస్ జీవన్ కనుకొలను డైరెక్ట్ చేస్తున్నాడు. చాలావరకు షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా ఆగింది. దీంతో కీలకమైన క్లైమాక్స్ పెండింగ్ ఉండిపోయింది. ప్రజెంట్ ఈ క్లైమాక్స్ పార్ట్ పూర్తిచేసే పనిలో ఉన్నారు టీమ్. అయితే ఇది స్పోర్ట్స్ డ్రామా కాబట్టి క్లైమాక్స్ భారీగా ప్లాన్ చేశారు. హాకీ మ్యాచ్ మీదనే క్లైమాక్స్ తీయాలట. దీన్ని మొహాలీలోని హాకీ స్టేడియంలో చిత్రీకరించాలని అనుకున్నారట.

పైగా ఈ క్లైమాక్స్ కోసం సుమారు 100 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఉండాలట. కానీ ప్రజెంట్ కొవిడ్ 19 పరిస్థితుల్లో అంతమంది టీంతో మొహాలీ వెళ్ళి షూట్ చేయడం అంత ఈజీ కాదు. అసలే ఎక్కువ మంది జనం ఒకచోట ఉండకూడదని, సినిమా షూటింగ్లు కూడ తక్కువ మందితో చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. దీంతో 100మంది కాకుండా 50 మందితో అడ్జెస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. కానీ కష్టమైనా మొహాలీలో స్టేడియంలోనే షూటింగ్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారట. ఎందుకంటే ఆ హాకీ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటమే కాకుండా మంచి వ్యూ కూడ కలిగి ఉంటుందట. అందుకే అక్కడే క్లైమాక్స్ షూట్ చేయాలని పట్టుదలగా ఉన్నారట.

ఇకపోతే ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటిస్తోంది. ఆమె కూడ ఇందులో హాకీ క్రీడాకారిణిగా కనిపించనుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయా పన్నెం నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన ‘సింగిల్ కింగులం’ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

సంబంధిత సమాచారం :

More