యంగ్ హీరోకి ఆయనతో సినిమా తీసేంత డబ్బులు లేవట.!

యంగ్ హీరోకి ఆయనతో సినిమా తీసేంత డబ్బులు లేవట.!

Published on May 7, 2015 8:59 PM IST

Sundeep_Kishan
ప్రస్తుతం టాలీవుడ్ లోని యంగ్ హీరోస్ లో ఒకరైన సందీప్ కిషన్ సినిమా సినిమాకి తన లోని నటనని మెరుగు పరుచుకుంటూ, తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సందీప్ కిషన్ నటించిన ‘టైగర్’ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. మేలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో ఓ డార్క్ క్రైమ్ కామెడీ జానర్లో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ రోజు ఈ యంగ్ హీరో సందీప్ కిషన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇటీవలే వినాయక్ తో మూవీ చేస్తాడు అని వచ్చిన వార్తలపై స్పందిస్తూ ‘ వినాయక్ గారితో సినిమా చేస్తున్నానని వచ్చిన వార్తల్లో నిజం లేదు. చెప్పాలంటే వినాయక్ గారితో సినిమా చేసే అన్ని డబ్బులు నా దగ్గర లేవు. పెద్ద డైరెక్టర్స్ తో చెయ్యాలని నాకూ ఉంటుంది. కానీ ఒకేసారి ఎదిగేయాలి అనుకోకూడదు, అలా స్టార్డం వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు. అందుకే స్టెప్ బై స్టెప్ పోరాడి గెలవాలి. అప్పుడే లైఫ్ చాలా మనకు సంతృప్తి ఉంటుందని’ సందీప్ కిషన్ అన్నాడు. అలాగే తనకి ట్రెండ్ తో పాటు ఫాలో అవుతూ సినిమాలు చేయడం ఇష్టం ఉండదని కూడా తెలియజేశాడు.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందీప్ కిషన్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

తాజా వార్తలు