తమిళ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సందీప్ కిషన్ !


తెలుగుతో పాటు తమిళంలో కూడా రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు యూజ్ హీరో సందీప్ కిషన్. ముఖ్యంగా తెలుగు, తమిళం ఇలా రెండు భాషళ్లోనూ సినిమానౌ ప్లాన్ చేసుకుంటున్న దర్శకులకు సందీప్ కిషన్ మంచి చాయిస్ గా నిలుస్తున్నారు. తమిళంలో ‘దురువంగల్ పతిన్నారు’ దర్శకుడు కార్తిక్ నరేన్ చేస్తున్న ‘నరగసూరన్’ సినిమాకు కూడా సైన్ చేశాడు సందీప్ కిషన్.

ఈ సినిమా షూటింగ్ ఇదివరకే మొదలవగా ఈరోజు సందీప్ కిషన్ తన పాత్ర తాలూకు షూటింగ్ ను ఊటీలో మొదలుపెట్టాడు. త్వరలో అరవింద స్వామి, శ్రియ శరన్ లు కూడా త్వరలోనే షూట్లో జాయిన్ కానున్నారు. గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ చిత్రమని తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో రిలీజ్ కానుంది.