ఆశ్చర్యపరుస్తున్న సందీప్ కిషన్ డెడికేషన్.!

Published on Sep 18, 2020 4:27 pm IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఇప్పటి వరకు ఎన్నో ఎంటర్టైనింగ్ చిత్రాల్లో నటించాడు. చాలా కాలం తర్వాత “నిను వీడని నీడను నేనే”, “తెనాలి రామకృష్ణ బిఏబిఎల్” వరుస విజయాలయతో మళ్ళీ ట్రాక్ లో పడ్డ ఈ హీరో ఇప్పుడు తనకి అచ్చొచ్చిన టైటిల్ ఫార్మాట్ “ఏ1 ఎక్స్ ప్రెస్” అనే చిత్రంలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమా కోసం సందీప్ కిషన్ పెట్టిన ఎఫర్ట్స్ ను చూసి మాత్రం ఎవరూ మెచ్చుకోకుండా ఉండట్లేదు.

స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్ సూపర్బ్ గా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ను చేసాడు. గత కొన్ని రోజుల కితమే తన వర్కౌట్ ఫోటోలు పెడుతూ ఉన్న సందీప్ నుంచి లేటెస్ట్ గా మరో ఫోటో కూడా వచ్చింది. ఇది చూసి మాత్రం మన టాలీవుడ్ ఆడియన్స్ స్టన్ అవుతున్నారు. సిక్స్ ప్యాక్ తో ఒక హాట్ లుక్ ను కేవలం ఈ సినిమా కోసం సందీప్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది.

దీనితో సందీప్ కిషన్ డెడికేషన్ లెవెల్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.తమిళ చిత్రం నప్తే తుణై చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి వచ్చిన హిట్ ట్రాక్ “సింగిల్ కింగులం” ఈ సినిమాపై మంచి హైప్ ను తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సందీప్ సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More