వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో సందీప్ కిషన్ యంగ్ అండ్ టాలెంటెడ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇటీవలే సందీప్ కిషన్ ఒక మెయిల్ ఐడి ఇచ్చి యంగ్ మేకర్స్ అయిన ఎవరైనా ఒక పేజి సినాప్సిస్ ని పంపమన్నాడు. అలా వచ్చిన వాటిలో నచ్చిన వారిని పిలిచి పూర్తి నేరేషన్ ఇమ్మంటారు. మీ కథ నచ్చితే మీరు దర్శకత్వం వహించే మొదటి సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తాడు.
చెప్పాలంటే గతంలో సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అతను కూడా ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్.. సందీప్ కిషన్ కాకుండా డైరెక్టర్ పూరి జగన్నాధ్, విష్ణు మంచు కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ టాలెంట్ ని గమనించి వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్.. మీ తలుపు తట్టిన ఈ బంపర్ ఆఫర్ ని వదులు కోకండి..


