‘సుబ్రహ్మణ్యపురం’ దర్శకునితో సందీప్ కిషన్ చిత్రం !

Published on Jan 14, 2019 11:00 pm IST

యువ కథానాయకుడు సందీప్ కిషన్, “సుబ్రహ్మణ్యపురం” చిత్రంతో విమర్శకుల మెప్పు పొందిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో క్రీడా నేపధ్యంలో ఒక సినిమా చేయబోతున్నారు. భారతంలో తన బొమ్మను గురువుగా భావించి విద్య నేర్చుకున్న ఏకలవ్యుడి నుంచి బొటనవేలు గురుదక్షిణగా తీసుకున్నాడు ద్రోణాచార్యులు.

ఈ ఆధునికకాలంలో అలాంటి ఒక గురువు ఎలాంటి గురుదక్షిణ అడిగాడు అనే ఉత్సుకత రేకెత్తించే కధాంశంతో రూపొందించే ఈ చిత్రానికి నిర్మాత ‘కార్తికేయ’ లాంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్. మిగిలిన నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేస్తారు.

సంబంధిత సమాచారం :

More