సునీల్ ఆ తమిళ రీమేక్ చేస్తున్నారా ?

Published on May 7, 2021 12:06 am IST

తెలుగులో ఈమధ్య రీమేక్ సినిమాల సందడి ఎక్కువైంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హీరోలందరూ పర భాషల్లో హిట్టైన కథలు తమకు సరిపోతాయి అనుకుంటే వెంటనే రీమేక్ చేసేస్తున్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో దాదాపు 10 రీమేక్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలున్నాయి. నటుడు సునీల్ కూడ ఇప్పుడు ఒక రీమేక్ కథను చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళంలో ప్రముఖ కమెడియన్ యోగిబాబు ‘మండేలా’ అనే సినిమా చేశారు. ఇటీవలే ఓటీటీ ద్వారా రిలీజైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అలాగే కొన్ని కొన్ని కాంట్రవర్సీలకు దారితీసింది. మొదట ఈ రీమేక్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చేస్తారనే టాక్ బలంగా వినబడింది. కానీ ఇప్పుడు సునీల్ పేరు తెరమీదకు వచ్చింది. నిర్మాతగా అనిల్ సుంకర పేరు వినబడుతోంది కానీ దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. మరి ఈ వార్తల్లో ఎంతమేరకు వాస్తవముందో తెలియాలంటే సునీల్ లేదా నిర్మాత అనిల్ సుంకర నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :