మరో సారి రజనీకాంత్ కి విలన్ గా బాలీవుడ్ హీరో.

Published on May 23, 2019 1:26 pm IST

రజనీకాంత్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన “2.0” బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా చేసిన సంగతి తెలిసిందే. రజని లేటెస్ట్ మూవీ “దర్బార్” మూవీకి కూడా విలన్ పాత్ర కొరకు ఓ బాలీవుడ్ హీరో ని ఎంపిక చేశారని సమాచారం. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న “దర్బార్” మూవీలో ప్రతినాయకుడి పాత్ర బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టిని చేస్తున్నారు.

ఇటీవలే ముంబై లో ఓ మేజర్ షెడ్యూలు చిత్రీకరణ పూర్తి చేసిన చిత్ర యూనిట్ మరో షెడ్యూల్ ని త్వరలో ముంబై లోనే చిత్రీకరించాలని ప్రణాళిక సిద్ధం చేసాడంట. ఈ షెడ్యూల్ లో సునీల్ పాల్గొననున్నాడని వినికిడి. సునీల్ శెట్టి ఆల్రెడీ కిచ్చా సుదీప్ నటిస్తున్న కన్నడ మూవీ “పహిల్వాన్” లో నెగటివ్ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More