‘బాహుబలి’ రచయితతో సునీల్ సినిమా !
Published on Nov 13, 2017 12:01 pm IST

హీరో సునీల్ గత కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ లేక ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన చేయలవలసిన రెండు ప్రాజెక్ట్స్ కూడా కొన్ని అనివార్య కారణాల వలన ఆగిపోయాయి. కానీ వాటికి బదులుగా ఆయనకు ఇప్పుడొక మంచి ఆఫర్ తగిలింది. తాజాగా జరిగిన ఒక మీడియా సమావేశంలో సునీల్ మాట్లాడుతూ ‘బాహుబలి’ కి రచయిత విజయేంద్ర ప్రసాద్ తో ఒక సినిమా చేయనున్నట్లు తెలిపారు.

విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో సునీల్ వెంటనే ఆ ప్రాజెక్టుకు ఒప్పుకున్నానని, త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అన్నారు. విజయేంద్రప్రసాద్ గతంలో ‘రాజన్న, శ్రీవల్లి’ వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు. ఇకపోతే సునీల్ నటిస్తున్న తాజా చిత్రం ‘2 కంట్రీస్’ త్వరలోనే రిలీజ్ కానుంది.

 
Like us on Facebook