“పుష్ప” ఐటం సాంగ్‌కు సన్నీలియోన్ గట్టిగానే డిమాండ్ చేస్తుందా?

Published on Jul 27, 2021 2:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌ రోల్‌ చేస్తుండగా, యాంకర్‌ అనసూయ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇకపోతే రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది చివర్లో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది.

ఇదిలాఉంటే ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసం చిత్ర యూనిట్ బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ని కాంటాక్ట్ అయినట్టుగా సమాచారం. అయితే ఈ సాంగ్ కోసం సన్నీ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. సుమారుగా మూడు నిమిషాల నిడివి గల ఆ పాటలో అల్లు అర్జున్‌తో డాన్స్ చేయడానికి సన్నీ రూ.70 లక్షలు డిమాండ్ చేసిందట. అయితే సన్నీ డిమాండ్‌ని బట్టి అడిగినంత ఇవ్వడానికి చిత్ర యూనిట్ కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :