భయపెట్టేలా సన్నీ లియోన్ “మందిర” ఫస్ట్ లుక్!

భయపెట్టేలా సన్నీ లియోన్ “మందిర” ఫస్ట్ లుక్!

Published on Apr 19, 2024 8:00 PM IST

ప్రస్తుతం హారర్ కామెడీ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సన్నీ లియోన్ ఇది వరకు ఎన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నారు. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద రాబోతోన్న చిత్రం మందిర. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి ఆర్ యువన్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు వదిలారు. మందిర చిత్రానికి సంబంధించిన టైటిల్, సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సన్నీ లియోన్‌ను ఈ పోస్టర్‌లో గమనిస్తుంటే భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే మిగిలిన వివరాలను ప్రకటించనున్నారు.

సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి బ్యానర్ విజన్ మూవీ మేకర్స్, సమర్పణ కొమ్మలపాటి శ్రీధర్, నిర్మాత సాయి సుధాకర్ కొమ్మలపాటి, దర్శకుడు ఆర్ యువన్, డైలాగ్స్ కే రవింద్ర కళ్యాణ్, శ్రీ సాయి, మ్యూజిక్ జావెద్ రియాజ్, కెమెరామెన్ దీపక్ డి. మీనన్, పీఆర్వో సాయి సతీష్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు