మంచు ఫ్యామిలీ యంగ్ హీరో మంచు మనోజ్ నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘కరెంట్ తీగ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నారు. మొదటి సారి మంచు మనోజ్ సినిమాని మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించాడు. సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిన్చానున్న ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాకి సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.
ఈ విషయంపై మంచు విష్ణు స్పందిస్తూ ‘ సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి కారణం సన్నీ లియోన్ చేసిన స్పెషల్ సాంగ్ మాత్రమే.. ఆ పాట తీసేస్తే ‘యు/ ఏ’ ఇస్తాము అన్నారు కానీ కథా ప్రకారం అది అవసరం కావున అలానే ఉంచి ‘ఏ’ తీసుకున్నాం. ఈ సినిమాలో సన్నీ లియోన్ చేసిన పాత్రగానీ లేదా స్పెషల్ సాంగ్ గానీ ఏ మాత్రం వల్గర్ గా ఉండదు. కానీ సెన్సార్ బోర్డు కి మాత్రం ఎందుకు అలా అనిపించిందో తెలియడం లేదని’ అన్నాడు. అలాగే మంచు విష్ణు ఈ చిఎన్మా మనోజ్ కెరీర్ లో కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు.
మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించాడు. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అచ్చు సంగీతం అందించాడు.


