సూపర్ క్లిక్ : మెగాస్టార్ పవర్ స్టార్ లతో స్టార్ నటి

సూపర్ క్లిక్ : మెగాస్టార్ పవర్ స్టార్ లతో స్టార్ నటి

Published on Apr 10, 2024 12:01 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ విశ్వంభర. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీని 2025 జనవరి 10న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

మ్యాటర్ ఏమిటంటే, నిన్న హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న మూవీ సెట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విచ్చేసారు. ఈ సందర్భంగా మెగాస్టార్, పవర్ స్టార్ లతో కలిసి దిగిన సూపర్ క్లిక్ ని కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు త్రిష. కాగా గతంలో పవర్ స్టార్ తో కలిసి ఆమె తీన్ మార్ మూవీలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక వారు ముగ్గురి పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు