సూపర్ క్లిక్స్ : పార్టీ మోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత

Published on Jun 6, 2023 1:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా బాగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుని సినిమా పై అంచనాలు మరింతగా పెంచేసింది.

ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన సినిమాలు, ఫ్యామిలికి సంబందించిన పలు విషయాలు షేర్ చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న రాత్రి తమ ఫ్రెండ్స్, ఫ్యామిలితో కలిసి జరుపుకున్న ఒక పార్టీ ఈవెంట్ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు. కాగా ఈ పిక్స్ లో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టగా ఆయనతో పాటు నమ్రత శిరోద్కర్ అలానే మరికొందరు వారి స్నేహితులని చూడవచ్చు. ప్రస్తుతం ఈ సూపర్ క్లిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :