“సూపర్ డీలక్స్” తెలుగు ట్రైలర్ రిలీజ్..!

Published on Aug 3, 2021 8:03 pm IST

తమిళంలో సూపర్ హిట్ అయిన “సూపర్ డీలక్స్” సినిమా తెలుగులో రానుంది. త్యాగరాజన్‌ కుమారరాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో ఆగస్టు 6న ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, వాటి నుంచి ఆ నలుగురు ఎలా బయటపడ్డారు అనేదే పూర్తి కథాంశం.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :