సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందా ?

సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందా ?

Published on Aug 4, 2018 2:29 PM IST

Surya anushkajpg

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సిరీస్ ఎంత పెద్ద విజయం సాధిచిందో తెలిసిందే. ఈ సిరీస్ లో వచ్చిన 3 సినిమాల్లో సూర్య కు జోడిగా అనుష్క నటించింది. యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

ఇక ఇప్పుడు సూర్య 39వ చిత్రాన్ని కూడా మళ్లీ ఈ దర్శకుడే తెరకెక్కించనున్నారు. అయితే ఈ చిత్రం సింగం సిరీస్ కు సీక్వెల్ కాదు. ఈసినిమాకి కూడా సూర్యకు జోడిగా అనుష్కనే తీసుకోవాలని భాసిస్తున్నాడట హరి. దాంట్లో భాగంగా ఇటీవల అనుష్కను కలిసి స్టోరీ కూడా వినిపించారట. మరి ఆమె సూర్య తో మరోసారి నటిస్తుందో లేదో చూడాలి.

ఇక సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో’ఎన్ జి కె’ చిత్రంతో పాటు కే వి ఆనంద్ తెరకెక్కిస్తున్న తన 37వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రాల తరువాత ‘ఇరుది సుత్రు’ ఫెమ్ సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాలను పూర్తి చేసిన తరువాత సూర్య, హరి తో సినిమాను మొదలు పెట్టనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు