పుష్ప పాటలకి సోషల్ మీడియా లో సూపర్ క్రేజ్!

Published on Nov 17, 2021 1:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలకు సోషల్ మీడియా లో సూపర్ క్రేజ్ పెరిగింది.

అయితే ఇప్పటి వరకు పుష్ప ది రైజ్ పాటలకు 100కే కి పైగా రీల్స్ రావడం విశేషం. ఈ విషయాన్ని పుష్ప టీమ్ సోషల్ మీడియా వేదిక గా వెల్లడించడం జరిగింది. ఈ పాటలకు వస్తున్న రెస్పాన్స్ కు మరియు ప్రేమ కు చిత్ర యూనిట్ థాంక్స్ తెలిపింది. అంతేకాక నవంబర్ 19 వ తేదీన పుష్ప చిత్రానికి సంగీతం 4 వ లిరికల్ వీడియో వస్తున్నట్లు తెలిపింది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మీక నటిస్తుంది. ఫాహద్, అనసూయ భరద్వాజ్ మరియు సునీల్ ఈ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More