బుల్లితెర పై రామ్ “ది వారియర్” కి సూపర్ రెస్పాన్స్!

బుల్లితెర పై రామ్ “ది వారియర్” కి సూపర్ రెస్పాన్స్!

Published on Nov 10, 2022 5:09 PM IST


రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో వసూళ్లను రాబట్టకపోయినా, బుల్లితెర పై మాత్రం అద్దిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది ఈ చిత్రం.

ఇటీవల స్టార్ మా లో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించింది. తాజాగా అందుకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ చిత్రం కి 9.85 టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. ఈ తరహా రేటింగ్ అంటే సూపర్ అనే చెప్పాలి. ఈ చిత్రం లో రామ్ అటు డాక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా నటించారు. రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం లో ఆది పినిశెట్టి, అక్షర గౌడ లు కీలక పాత్రల్లో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు