మరోసారి “సలార్” సెన్సేషన్!

మరోసారి “సలార్” సెన్సేషన్!

Published on Jan 21, 2024 11:39 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ సలార్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ లోక్ ఈ సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో మంచి స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకు పోతుంది.

ఈ చిత్రం కి సంబందించిన కొన్ని క్లిప్స్, ఫోటోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. సినిమా మరోసారి సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు