ఓటిటిలో “ఊర్వశివో రాక్షసివో” చిత్రానికి సూపర్ రెస్పాన్స్!

ఓటిటిలో “ఊర్వశివో రాక్షసివో” చిత్రానికి సూపర్ రెస్పాన్స్!

Published on Dec 11, 2022 8:30 PM IST

మెగా హీరో అల్లు శిరీష్ కొంత గ్యాప్ తర్వాత ఊర్వశివో రాక్షసివో చిత్రంతో పెద్ద తెరపైకి వచ్చారు. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది మరియు ప్రధాన జంట కెమిస్ట్రీ అద్భుతంగా ఈ చిత్రంలో పనిచేసింది. థియేట్రికల్ రన్ తర్వాత, సినిమా ఇప్పుడు ఆహా మరియు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రంకి మంచి రెస్పాన్స్ వస్తోంది అని ఇంతకు ముందు నివేదించాము.

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ప్రీమియర్ షో చేసిన 48 గంటల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల్లో దూసుకుపోయింది. రెండు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ లలో ఈ చిత్రం కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాకేష్ శశి రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి సంయుక్తం గా నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, అల్లు అరవింద్ సమర్పకుడు గా వ్యవహరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు