సూపర్ స్టార్ మహేష్ తన పాన్ ఇండియా మూవీ పై కీలక వ్యాఖ్యలు!

Published on Oct 15, 2021 1:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకూ బాలివుడ్ పై దృష్టి సారించలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా మహేష్ తన పాన్ ఇండియన్ మూవీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

సరైన సమయంలో సరైన సినిమా చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు. ఒకవేళ అది హిందీ చిత్రం అయితే, దానికి ఇది సరైన సమయం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తన తర్వాత చిత్రం రాజమౌళి తో ఉందని అన్నారు. రాజమౌళి తో ఉండే చిత్రం అన్ని బాషల్లో విడుదల అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ చేసిన వ్యాఖ్యల పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో సూపర్ స్టార్ క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ చిత్రం ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :