మౌంటెన్‌ డ్యూ కి బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేష్‌

మౌంటెన్‌ డ్యూ కి బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేష్‌

Published on Dec 3, 2021 8:19 PM IST


డర్‌ కే ఆగే జీత్‌ హై సిద్ధాంతాన్ని పునరుద్ధరించడానికి బ్రాండ్‌ యొక్క అధిక శక్తివంతమైన ప్రచారాలకు ముఖ చిత్రంగా సూపర్ స్టార్ మహేష్‌బాబు వ్యవహరించనున్నారు. భారతదేశ వ్యాప్తంగా మౌంటెన్‌ డ్యూ యొక్క అనుసంధానతను మరింత విస్తరించడమే లక్ష్యంగా భాగస్వామ్యం అయినట్లు తెలుస్తోంది.

ప్రమాదాలను సైతం ప్రమోదంగా భావిస్తూనే, అసాధారణ విజయాలను సాధించడానికి తమకున్న హద్దులను సైతం అవలీలగా అధిగమించే స్ఫూర్తిదాతలకు మౌంటెన్‌ డ్యూ ఎల్లప్పుడూ వందనం సమర్పిస్తూనే ఉంటుంది. యువతకు స్ఫూర్తి కలిగించాలనే తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ, మౌంటెన్‌ డ్యూ ఇప్పుడు సుప్రసిద్ధ నటుడు, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబును తమ బ్రాండ్‌ ప్రచారకర్తగా ఎన్నుకున్నట్లు వెల్లడించింది. మౌంటెన్‌ డ్యూ మరియు మహేష్‌బాబు నడుమ ఈ అత్యున్నత శక్తివంతమైన భాగస్వామ్యంతో బ్రాండ్‌ యొక్క చేరిక మరింతగా విస్తరించడంతో పాటుగా బ్రాండ్‌ యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన డర్‌ కే ఆగే జీత్‌ హై సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకురానుంది.

ఎన్నో సంవత్సరాలుగా మౌంటెన్‌ డ్యూ, యువత నడుమ తమ బ్రాండ్‌ సిద్ధాంతాన్ని ఉన్నతంగా నిర్మించింది. ప్రతి ఒక్కరిలోనూ భయం ఉంటుంది. అయితే రియల్‌ హీరోలకు తమకు ఎదురైన ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజేతలుగా నిలిచే శక్తి కూడా ఉంటుందని ఈ బ్రాండ్‌ సిద్ధాంతం విశదీకరిస్తుంది. తెలుగు సినిమాలో మహేష్‌బాబు చేసిన అసామాన్యమైన కృషికిగానూ మహేష్‌బాబు ప్రశంసలు పొందడమే కాదు, దేశవ్యాప్తంగా అశేష అభిమానులనూ కలిగి ఉన్నారు. ఈ శక్తివంతమైన భాగస్వామ్యం, భారతదేశవ్యాప్తంగా వినియోగదారులను 2022 సంవత్సరం వేసవిలో మరింత సాహసం, మరింత ఉత్సాహం మరియు మరింత ధైర్యంతో నిమగ్నం చేస్తుంది.

ఈ తాజా భాగస్వామ్యం గురంచి వినీత్‌శర్మ, కేటగిరి డైరెక్టర్‌ మౌంటెన్‌ డ్యూ అండ్‌ స్టింగ్‌, పెప్సికో ఇండియా మాట్లాడుతూ, “భారతదేశ వ్యాప్తంగా బ్రాండ్‌ యొక్క తెగువ, సాహసం, ధైర్యం మరియు దాని వినియోగదారుల వ్యక్తిత్వాన్ని నిర్వచించేటటువంటి పేరు, మహేష్‌బాబుతో చేతులు కలపడాన్ని మేము గర్వంగా భావిస్తున్నాం. బ్రాండ్‌ సిద్ధాంతమైనటువంటి డర్‌ కే ఆగే జీత్‌ హై సిద్ధాంతానికి అసలైన ప్రతీక అతను. దేశవ్యాప్తంగా అశేష అభిమానులను ఆయన కలిగి ఉన్నారు. బ్రాండ్‌ యొక్క పాదముద్రికలను విస్తరించాలనుకుంటున్న వేళ ఈ ప్రాంతంలో మా వినియోగదారులను మరింతగా చేరుకోవడంలో మహేష్‌ కీలకం కానున్నారు. అభిమానులకు స్ఫూర్తి కలిగించడంతో పాటుగా వారిలో ఉత్సాహాన్ని తీసుకువచ్చే రీతిలో భయంతో పోరాడే వైవిధ్యమైన రూపాలలో నటుడిని చూపేందుకు మేము సిద్ధమైన వేళ 2022లో మౌంటెన్‌ డ్యూ యొక్క ప్రయాణం కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నాము” అని అన్నారు.

టీవీసీ షూటింగ్‌లో తన అనుభవం గురించి బ్రాండ్‌ ప్రచారకర్త మహేష్‌బాబు మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో భయపడతారని నేను భావిస్తున్నాను. సినీ నటులు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. మనం ధైర్యంగా మరియు అజేయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే, తనలోని భయాలను, స్వీయ సందేహాలను అధిగమించేందుకు హద్దులను సైతం వెనుక్కినెట్టేసేవాడే అసలైన హీరో. మౌంటెన్‌ డ్యూ యొక్క ఫిలాసఫీ డర్‌ కే ఆగే జీత్‌ హై ఎప్పుడూ కూడా నన్ను బలంగా ప్రతిధ్వనిస్తుంది, ఎందుకంటే అది నా నమ్మకానికి అనుగుణంగా ఉంటుంది. అసాధారణత వైపు నన్ను నేను నెట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతుంటాను. త్వరలో మా ప్రేక్షకుల కోసం మాయాజాలం చేయడానికి మౌంటెన్‌ డ్యూతో చేతులు కలపడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను” అని అన్నారు.

ఈ శక్తివంతమైన భాగస్వామ్యంలో భాగంగా బ్రాండ్‌ యొక్క నూతన టీవీసీ ప్రచారంలో మహేష్‌బాబు కనిపించనున్నారు. ఇది 2021 లోనే సంప్రదాయ మరియు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై కనిపించనుంది. మౌంటెన్‌ డ్యూ ఇప్పుడు సింగిల్‌ అండ్ మల్టీ సర్వ్‌ ప్యాక్‌లలో ఆధునిక, సంప్రదాయ రిటైల్‌ ఔట్‌లెట్స్‌, మరియు భారతదేశవ్యాప్తంగా సుప్రసిద్ధ ఈ కామర్స్‌ వేదికలపై లభ్యమవుతుంది.

భారతదేశంలో పెప్సీకో 1989లో ప్రవేశించింది. అప్పటి నుంచి వృద్ధి చెందుతూ దేశంలో అతిపెద్ద ఎంఎన్‌సీ ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో పెప్సీకో ఇండియా నిలకడగా పెట్టుబడులు పెడుతూ విస్తృతశ్రేణిలో బేవరేజెస్‌ మరియు స్నాక్‌ ఫుడ్‌ వ్యాపారాన్ని విస్తరించింది. దేశవ్యాప్తంగా సంస్థకు 63 ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ ప్లాంట్స్‌ ఉన్నాయి. పెప్సీకో ఇండియా విస్తృతమైన ఫోర్ట్‌ఫోలియోలో ఐకానిక్‌ బ్రాండ్స్‌ అయిన పెప్సీ, లేస్‌, కుర్‌కురే, ట్రోపికానా 100%, గాటోరాడ్‌, క్వాకర్‌ ఉన్నాయి.

భారతదేశంలో పెప్సికో యొక్క వృద్ధిని ప్రయోజనంతో కూడిన ప్రదర్శన నిర్ధేశిస్తుంది. అనుకూలమైన ఆహారాలు మరియు పానీయాలలో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉండాలనే మా లక్ష్యంకు ఇది మార్గనిర్ధేశనమూ చేస్తుంది. మార్కెట్‌ ప్రాంగణంలో నిలకడగా గెలవాలనే మా ఆశయాన్ని విన్నింగ్‌ విత్‌ పర్పస్‌ ప్రతిబింబిస్తుంది మరియు వ్యాపారానికి సంబంధించిన అన్ని అంశాలలోనూ ప్రయోజనం పొందుబరచబడుతుంది. మరింత సమచారం కొరకు దయచేసి www.pepsico.com ను చూడండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు