డబ్బింగ్ స్టార్ట్ చేసిన సూపర్ స్టార్

Published on Nov 14, 2019 4:51 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజుల క్రితమే ‘దర్బార్’ సినిమా షూటింగ్ ముగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన మళ్లీ ‘దర్బార్’ పనులు మొదలుపెట్టారు. ఈరోజే ఆయన డబ్బింగ్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. ఏఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రజనీ ఆదిత్య అరుణాచలం అనే అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ బాగా క్లిక్ అయింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ‘దర్బార్’ పేరుతోనే రానుంది. జనవరి 11న చిత్రం విడుదలవుతుందని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరొక నటి నివేత థామస్ సైతం ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More