మహేష్ బాబు నన్ను ప్రశంసించాడు – సుప్రియా యార్లగడ్డ

మహేష్ బాబు నన్ను ప్రశంసించాడు – సుప్రియా యార్లగడ్డ

Published on Aug 5, 2018 11:23 AM IST

mahesh supriya

దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సుప్రియా యార్లగడ్డ మళ్ళీ వెండితెరకు “గూఢచారి”తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో త్రినేత్ర సీక్రెట్ ఏజెంట్ గా నదియా ఖురేషీ పాత్రను పోషించిన సుప్రియా యార్లగడ్డ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాక సినిమా విజయానికి చాలా కీలకంగా నిలిచారు. ప్రస్తుతం ఆమె నటనకు ప్రశంసలు వర్షం కురుస్తోంది. తాజాగా గూఢచారి చిత్రంలో ఆమె నటనకు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారట. ఈ విషయాన్నీ స్వయంగా సుప్రియానే తెలుపుతూ మహేష్ గూఢచారి చిత్రాన్ని చూసారని, నా నటనను ఎంతగానో ప్రశంసించారని ఆమె తెలిపారు.

కాగా శుక్రవారం విడుదలైన గూఢచారికి విశేషమైన స్పందన లభిస్తోంది. శశి కిరన్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్ హీరోగా నటించారు

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు