సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రి నుండి ఇంటికి చేరిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రజిని ఆరోగ్యం పూర్తీ నిలకడగా ఉంది. అందుకే మళ్ళీ షూట్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. సంక్రాంతి అనంతరం షూటింగ్ పెట్టుకుందామని మేకర్స్ కి రజిని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడట. కాగా యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా ఇంటర్వెల్ సీన్స్ ను ముందుగా షూట్ చేస్తారట.
కాగా ఆ తరువాత రజిని – ఖుష్బూ కలయికలో వచ్చే ఫ్యామిలీ సీన్స్ తీస్తారని తెలుస్తోంది. కాగా ఖుష్బూ ఈ సినిమా కోసం బరువు తగ్గి సరికొత్తగా రెడీ అయింది. రజనీ – ఖుష్బూలది హిట్ కాంబినేషన్. గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాల్లో కలిసి చేశారు. మళ్లీ చాలా సంవత్సరాలు తరువాత ఇప్పుడు కలిసి నటిస్తున్నారు.
అన్నట్టు ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ.. ‘రజిని సర్ కాబట్టే.. ఈ సినిమా చేస్తున్నాను. అలాగే నా పాత్ర కూడా నాకు కొత్తగా అనిపించింది. ఇక రజిని సర్ నాకు మధ్య కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాయి’ అని ఖుష్బూ చెప్పుకొచ్చింది.


