శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కి మహేష్ గ్రీన్ సిగ్నల్.?

శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కి మహేష్ గ్రీన్ సిగ్నల్.?

Published on Oct 18, 2015 11:26 PM IST

mahesh-babu-sekhar-kamula

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది శ్రీమంతుడు సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ని నమోదు చేసాడు. ప్రస్తుతం మేహేష్ బాబు నుంచి రానున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా సెట్స్ పై ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన మహేష్ బాబు షూటింగ్ కి బరాక్ ఇచ్చి తన ఫ్యామిలీతో హాలిడే ని ఎంజాయ్ చెయ్యడం కోసం పారిస్ వెళ్ళాడు. బ్రహ్మోత్సవం సెట్స్ పై ఉండాగానే మహేష్ బాబు తదుపరి సినిమా మురుగదాస్ తో ఉంటుందని, దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని ఇది వరకే తెలిపాము.

ఇది కాకుండా మరో క్రేజీ డైరెక్టర్ కూడా మహేష్ తో తన తదుపరి సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. అతనే సున్నితమైన బావోద్వేగాలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల. వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా ఉండాలి కానీ అది సెట్స్ పైకి వెళ్ళలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం బ్రోహ్మోత్సవం సెట్లో శేఖర్ కమ్ముల మహేష్ ని కలిసి కథని వినిపించాడట. దానికి మహేహ్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో వచ్చే ఏడాది ఏదో ఒక సీజన్ లో మహేష్ బాబు శేఖర్ కమ్ముల సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడని సమాచారం. అన్నీ అనుకున్నట్టే జరిగి వీరి కాంబినేషన్ గనుక సెట్ అయితే వీరి నుంచి ఒక సూపర్ కూల్ క్లాస్ ఎంటర్టైనర్ ని మనం ఆశించవచ్చు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు