బాక్సాఫీస్ వద్ద ధూమ్ ధామ్ ధమాకా కి రెడీ అయిన ‘దసరా’

Published on Mar 29, 2023 10:06 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దసరా. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ మూవీ పై నాని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై మరింత హైప్ ఏర్పరిచాయి.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి అందించగా దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, షామా ఖాసిం తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. నిజానికి ఈ మూవీ తొలిసారిగా తన కెరీర్ ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ కావడంతో నాని అన్ని భాషల్లో కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. ఇక ట్రైలర్, టీజర్ లలో నాని మాస్ స్టైల్, యాక్టింగ్, డైలాగ్స్ వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా తప్పకుండా రేపు భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద ధూమ్ ధామ్ ధమాకా చూపించడం ఖాయం అని యూనిట్ అభిప్రాయపడుతోంది.

సంబంధిత సమాచారం :