రామ్ కోసం సైరా దర్శకుడి పవర్ఫుల్ సబ్జెక్ట్?

Published on Jul 7, 2020 7:33 am IST

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన సురేందర్ రెడ్డి కెరీర్ బిగినింగ్ నుండి దాదాపు స్టార్ హీరోలతోనే చిత్రాలు చేశాడు. గత ఏడాది ఆయన చిరుతో సైరా నరసింహారెడ్డి చిత్రం చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా సైరా నిలిచింది. ఐతే ఆయన నెక్స్ట్ చిత్రం కోసం స్టార్ హీరోల కోసం ట్రై చేసినా అందరూ కమిటై ఉండడం తో ఆయనకు అవకాశం దక్కలేదు.

దీనితో సురేంధర్ రెడ్డి యంగ్ హీరో రామ్ తో కమిటైనట్లు వార్తలు వస్తున్నాయి. రెడ్ మూవీ అనంతరం రామ్ సురేందర్ రెడ్డి సినిమాలో జాయిన్ అవుతాడట. ఇస్మార్ట్ శంకర్ తో ఫార్మ్ లోకి వచ్చిన రామ్ కోసం ఓ మాస్ కమర్షియల్ సబ్జెక్టు సిద్ధం చేశారట. రామ్ హీరోయిజం ఓ రేంజ్ లో ఎలివేట్ చేసేలా ఉండే ఆ సబ్జెక్టు రామ్ స్టార్ డమ్ పెంచేలా ఉంటుందట. ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.

సంబంధిత సమాచారం :

More