పాపులర్ కొరియన్ సినిమాను రీమేక్ చేయనున్న “సురేష్ ప్రొడక్షన్స్”

Published on Jan 20, 2021 2:00 pm IST

మన టాలీవుడ్ లో క్లీన్ ఎంటర్టైనర్ అండ్ మంచి క్వాలిటీ ఉన్న సినిమాలను అందించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు ముందుంటారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇప్పటి వరకు అలా ఎన్నో ఫీల్ గుడ్ సినిమాలను పరిచయం చేసిన సినిమాలు చూసాము.

మరి ఇప్పుడు వీరి నుంచి మరో ఆసక్తికర సినిమా రావడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలిపారు. కొరియన్ భాషకు చెందిన చిత్రం “లక్కీ కీ” అనే సినిమాకు అధికారికంగా రీమేక్ చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే కొరియన్ లో ఈ చిత్రాన్ని జాపనీస్ నుంచి “కీ ఆఫ్ లైఫ్” నుంచి తెరకెక్కించినట్టుగా తెలిపారు.

కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఉండే ఈ చిత్రం తాలూకా అన్ని ఇండియన్ భాషల తాలూకా రీమేక్ హక్కులను తాము కొనుగోలు చేసినట్టుగా వెల్లడించారు. అంతే కాకుండా ప్రస్తుతానికి ఒక ప్రముఖ నటుడిని మరియు దర్శకున్ని తీసుకోనున్నట్టుగా తెలిపారు. మరి ఆ వివరాలు త్వరలోనే రానున్నాయి.

సంబంధిత సమాచారం :