
మూవీ మొఘల్ డా.డి. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ తెలుగు చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా నిలిచిపోయింది. రామానాయుడు స్థాపించిన ఈ సినిమా మొట్ట మొదట స్వర్గీయ నందమూరి తారక రామారావుతో ‘రాముడు – భీముడు’ సినిమా తీసారు. ఈ సినిమాతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి కూడా నేటితో 50 సంవత్సరాలు పూర్తయ్యింది.
ఈ 50 సంవత్సరాల జర్నీలో డా.డి రామానాయుడు ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ. కన్నడ, మలయాళం, ఒరియా, ఇంగ్లీష్, పంజాబీ భాషల్లో కూడా సినిమాలను నిర్మించారు. ఇన్ని భాషల్లో సినిమాలు తీసిన ఘనత కూడా ఈ సంస్థకే దక్కింది. ఇది కాకుండా ఈ సంస్థ నుండి తీసిన సినిమాల ద్వారా ఎంతోమంది దర్శకులు, నటీనటులు తెలుగు తెరకు పరిచయమయ్యారు.
ఈ బ్యానర్ లో ‘రాముడు – భీముడు’, ‘శ్రీ కృష్ణతులాబారం’, ‘ప్రేమ నగర్’, ‘దేవత’, ‘ఆహానా పెళ్ళంట’, ‘ప్రేమ’, ‘తాజ్ మహల్’, ‘తాతా మనవడు’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మనకు అందించారు.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.