మళ్ళీ ‘సింగం’గా మారిన సూర్య.. కానీ ఈసారి కొత్తది?

మళ్ళీ ‘సింగం’గా మారిన సూర్య.. కానీ ఈసారి కొత్తది?

Published on Dec 20, 2025 12:31 AM IST

suriya

మన సౌత్ సినిమా దగ్గర కొన్ని పోలీస్ స్టోరీ సినిమాలు అంటూ వెంటనే గుర్తొచ్చే హీరోస్ ఇంకా చిత్రాల్లో స్టార్ హీరో సూర్య సినిమాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అప్పట్లో కాకా కాకా (తెలుగులో ‘ఘర్షణ’) తర్వాత సింగం సిరీస్ తో సూర్యకి తెలుగులో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇలా మూడు సినిమాలతో అలరించిన సూర్యకి పోలీస్ రోల్స్ కి మంచి అనుబంధం ఏర్పడింది.

ఇక మూడో సినిమా తర్వాత సూర్య నుంచి నెక్స్ట్ మళ్ళీ పోలీస్ జానర్ సినిమా పడలేదు కానీ ఇప్పుడు ఫైనల్ గా సూర్య మళ్ళీ పోలీస్ అవతార్ లోకి మారినట్టు వినిపిస్తుంది. రీసెంట్ గానే సూర్య 47వ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అందులో తాను పోలీస్ రోల్ లో కనిపిస్తారని ఆల్రెడీ టాక్ ఉంది.

మలయాళంలో సూపర్ హిట్ చిత్రం ఆవేశం తెరకెక్కించిన తాను సూర్యని ఇప్పుడు బ్యాడాస్ పోలీస్ గా ప్రెజెంట్ చేయనున్నట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తనపై సాలిడ్ ప్రోమో కట్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అదే షూట్ జరుగుతుంది అని త్వరలోనే దీనిని వదులుతారట. మరి ఈసారి సూర్య ఎలా అలరిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు