‘సూర్య – శివ’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on May 7, 2019 2:27 am IST

స్టార్ హీరో సూర్యతో తన తరువాత సినిమాను ప్లాన్ చేసుకున్నాడు ‘విశ్వాసం’ ఫేమ్ డైరెక్టర్ శివ. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా ఈ నెలాఖర్లో షూట్ కి వెళ్లాలనుకునప్పటికీ.. అది సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. శివ హెల్త్ బాగాలేదట. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్ద ప్రమాదం ఏమి లేదని.. ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చిందని తెలుస్తోంది.

కాగా వచ్చే నెల మొదటి వారం నుండి ఈ సినిమా రెగ్యూలర్ షూట్ మొదలు కానుందని సమాచారం. ఇక ఈ సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట. ముఖ్యంగా సూర్య క్యారెక్టర్ చాలా బాగుంటుందని తెలుస్తోంది.

ఇక గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించాడు. అయితే తెలుగులో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ.. తమిళంలో మాత్రం భారీ విజయాన్ని సాధించింది. దాంతో సూర్య, సినిమా చెయ్యడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :

More