ఇంటెన్స్ పవర్ ఫుల్ లుక్ లో సూర్య సెకండ్ పోస్టర్..!

Published on Jul 23, 2021 7:11 am IST


కోలీవుడ్ స్టార్ హీరోలలో సూర్య కూడా ఒకరు. అలాగే అక్కడ స్టార్ హీరోలలో మన దగ్గర కూడా మంచి మార్కెట్ ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోస్ లో కూడా సూర్య ఉంటాడు. మరి లాస్ట్ సినిమా “ఆకాశం నీ హద్దురా” ఓటిటి లో వచ్చినా కూడా మన దగ్గర కూడా భారీ హిట్ అయ్యింది. దీనితో సూర్య మార్కెట్ పడిపోతుంది అనుకునే సమయంలో సరైన విజయాన్ని సూర్య అందుకున్నట్టు అయ్యింది.

అయితే ఇక అక్కడ నుంచి సూర్య నెక్స్ట్ సినిమాలపై విపరీతంగా క్రేజ్ ఏర్పడింది. అదే క్రమంలోనే కోలీవుడ్ దర్శకుడు పాండిరాజ్ తో తన 40 సినిమాని అనౌన్స్ చేసి భారీ ని దీనిపై తెచ్చుకున్నాడు. మరి ఈ సినిమా నుంచి ఈరోజు సూర్య పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ ని వదిలారు. మరి వాటిలో సెకండ్ లుక్ మంచి ఇంట్రెస్టింగ్ గా మరియు ఇంటెన్స్ గా ఉందని చెప్పాలి.

చాలా కాలం తర్వాత సూర్య నుంచి మళ్లీ ఒక పవర్ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా చూడనున్నట్టు అర్ధం అవుతుంది. ఒక సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ కత్తి పట్టుకొని ఉన్న సూర్య ని ఈ పోస్టర్ లో చూపిస్తున్నారు. దీనితో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువైతే అయ్యాయి కానీ తగ్గలేదని చెప్పాల్సిందే.. అన్నట్టు ఈ సినిమాకి తమిళ్ లో “ఎతరెక్కుమ్ తునింధవన్” అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే డి ఇమ్మన్ సంగీతం అందుస్తున్నాడు..

సంబంధిత సమాచారం :