సూర్య మూవీ టీజర్ డేట్ ఫిక్స్డ్

Published on Jan 2, 2020 12:03 am IST

సూర్య లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దురా. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన గురు చిత్రాన్ని తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కాగా నేడు న్యూ ఇయర్ కానుకగా ఓ పోస్టర్ విడుదల చేశారు. అలాగే ఈ చిత్ర టీజర్ డేట్ కూడా ప్రకటించడం గమనార్హం.

ఈనెల 7న ఆకాశం నీ హద్దురా టీజర్ విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బయో పిక్ కొరకు సూర్య బాగానే కష్టపడుతున్నాడు. సూర్య ఈ మధ్య విజయాల పరంగా వెనుక బడ్డాడు. ఈ ఏడాది ఆయన విడుదల చేసిన ఎన్ జి కె, బందోబస్త్ చిత్రాలు పరాజయం చవిచూశాయి. అందుకే ఈ చిత్ర విజయంపై సూర్య చాలా అసలే పెట్టుకున్నారు. ఆకాశం నీ హద్దురా చిత్రానికి సంగీతం జి వి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :