ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?

Published on Jul 29, 2019 11:37 pm IST

ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రతి సినిమాకు స్టైల్ చేంజ్ చేస్తూ సినిమాలు చేసే హీరోల్లో.. సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది. అందుకే సూర్య ఖాతాలో ‘సింగం’ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు… ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ’24’ వంటి డిఫరెంట్ సినిమాలు… ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి లవ్ స్టోరీలు ఉన్నాయి. అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘కప్పాన్’. తెలుగులో ‘బందోబస్త్’గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో సూర్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ముఖ్యంగా సూర్య గెటప్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా.. సినిమా ప్రోమోస్ కు వస్తోన్న స్పందన చూస్తుంటే.. సినిమాలో విషయం ఉన్నట్లే కనిపిస్తోంది. మరి సూర్య ఈ సారి హిట్ కొడతాడేమో చూడాలి.

లైకా మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. హేరీశ్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో ఆర్య‌, స‌యేషా జంట కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :