సూర్య ‘పసంగ 2’కు తెలుగు టైటిల్ ఫిక్స్

సూర్య ‘పసంగ 2’కు తెలుగు టైటిల్ ఫిక్స్

Published on Oct 17, 2015 11:42 AM IST

memu
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న హీరో సూర్య తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బ్యానర్‌లో రూపొందిన ‘మాస్’ సినిమా కొద్ది నెలల క్రితం విడుదలై సూర్యకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత సూర్య తాజాగా నిర్మించిన ‘పసంగ 2’ అనే సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక సందర్భంగా ‘పసంగ 2’ను తెలుగులోనూ విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు.

జాతీయ అవార్డు గ్రహీత పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘పసంగ 2’ను తెలుగులో ‘మేము’ పేరుతో జూలకంటి మధుసూదన్ రెడ్డి విడుదల చేయనున్నారు. సూర్య, అమలాపాల్, బింధు మాధవి పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా మానసిక వ్యాధితో బాధపడే చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. పలువురు బాల నటులు మెయిన్ లీడ్స్‌లో నటించిన ఈ సినిమాలో సూర్య పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఇక తెలుగు ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్‌లకు సంబంధించిన వివరాలను త్వరలోనే విడుదల చేయనున్నామని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు