సూర్య సినిమా వాయిదా పడింది.. అనుమతులు రాలేదట

Published on Oct 23, 2020 3:00 am IST


స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘సూరరై పొట్రు’ ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకావాల్సి ఉంది. కానీ అనుకోని విధంగా విడుదల వాయిడాపడింది. ఈ విషయాన్ని సూర్య స్వయంగా వెల్లడించారు. వివారాల్లోకి వెళితే సినిమా విమానయాన రంగానికి చెందిన కథ కావడంతో టీమ్ నిజమైన ఎయిర్ ఫోర్స్ లొకేషన్లలో, నిజమైన విమానాలతో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రీకరణ కోసం విమానయాన రంగం నుండి, దేశ భద్రతా విభాగం నుండి అనేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. వాటి కోసం చిత్ర బృందం చాలా కష్టపడింది.

ఎప్పటికప్పుడు కొత్త అనుమతులు తీసుకుంటూ చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిత్రీకరణ ముగించారు. తీరా విడుదలకు వచ్చే సరికి థియేటర్లు మూతబడటంతో చివరికి అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే విడుదలకు విమానయాన శాఖ నుండి కొన్ని ఎన్ఓసీలు రావాల్సి ఉంది. అయితే అవి రావడం ఆలస్యమయ్యేలా ఉండటంతో 30వ తేదీన విడుదల లేదని, వాయిదా వేస్తున్నామని, అందరూ సహకరించాలని సూర్య లేఖ ద్వారా కోరారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది కూడ ఇంకా తెలియాల్సి ఉంది.

ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ ఫౌండర్, పైలట్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని సుధా కొంగర డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటించగా, జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More